IPL 2019:MS Dhoni is considered as one of the most shrewd brains of modern day cricket, but at the end of the day he is also a human being and the veteran stumper too sometimes goes wrong with his tips, said Kuldeep Yadav.
#iplfinal
#cskvmi
#msdhoni
#kuldeepyadav
#rohithsharma
#mumbaiindians
#chennaisuperkings
#shanewatson
ముంబైలో సోమవారం జరిగిన సియెట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ ఫంక్షన్‌లో కుల్దీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల్దీప్ మాట్లాడుతూ ధోనీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ధోనీ ఇచ్చిన సలహాలు కూడా చాలాసార్లు పనిచేయలేదు. అయినా ఆ విషయాన్ని ఆయనకు చెప్పలేదు' అని కుల్దీప్ సరదాగా వ్యాఖ్యానించాడు. 'ధోనీ ఎక్కువ మాట్లాడడు. మ్యాచ్‌లో అవసరమైన సందర్భంలో.. ఓవర్ల మధ్య విరామ సమయంలో తన అభిప్రాయాలను బౌలర్‌తో చెపుతారు' అని కుల్దీప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో కుల్‌దీప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై చేసిన వ్యాఖ్యలను మీడియా తప్పుగా చిత్రీకరించిందని టీమిండియా రిస్ట్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ అన్నారు.